Stock Market Closing: ఒక్కరోజులో రూ.96,000 కోట్లు పోగొట్టుకున్న ఇన్వెస్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Closing: వారం చివరి ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ముగిసింది. ఎఫ్‌ఎంసిజి, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్‌లో ఈ తగ్గుదల కనిపించింది. చాలామంది పెట్టుబడిదారులు లాభాల కోసం షేర్లను అమ్మకానికి పెట్టారు. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 365 పాయింట్లు పతనమై 65,322 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 115 పాయింట్ల క్షీణతతో 19,428 పాయింట్ల వద్ద ముగిసింది.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల కారణంగా బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయింది. ఎఫ్‌ఎంసిజి షేర్లు కూడా క్షీణించాయి. ఇది కాకుండా ఫార్మా, ఆటో, ఐటీ, మెటల్స్, ఎనర్జీ, మెటల్స్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్, ఆల్ & గ్యాస్ రంగాల షేర్లు ముగిశాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ మాత్రమే బూమ్‌ను చూశాయి. నేటి వ్యాపారంలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు కూడా ముగిశాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 7 లాభాలతో ముగియగా, 23 నష్టాలతో ముగిశాయి. కాగా నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 11 లాభాలతో ముగియగా, 39 నష్టాలను చవి చూశాయి.
Read Also:Lot Mobiles: లాట్ మొబైల్స్11వ వార్షికోత్సవ ఆఫర్లు.. అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్
స్టాక్ మార్కెట్ పతనం కారణంగా నేటి వ్యాపారంలో ఇన్వెస్టర్ల సంపద భారీగా క్షీణించింది. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ.305.54 లక్షల కోట్లుగా ఉన్న రూ.304.58 లక్షల కోట్లకు తగ్గింది. నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.96,000 కోట్లు క్షీణించింది. నేటి సెషన్లో హెచ్‌సిఎల్ టెక్ 3.24 శాతం, పవర్ గ్రిడ్ 0.95 శాతం, టైటాన్ కంపెనీ 0.88 శాతం, రిలయన్స్ 0.49 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.30 శాతం లాభంతో ముగిశాయి. ఎన్‌టీపీసీ 2.02 శాతం, సన్ ఫార్మా 1.59 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.52 శాతం, హెచ్‌యూఎల్ 1.39 శాతం చొప్పున నష్టపోయాయి.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!