కిరణ్ అబ్బవరం కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న చిత్రం ‘K’. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. హాస్య మూవీస్ బ్యానర్ లో 7 వ సినిమాగా రానున్న ఈ సినిమను కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై నిర్మించారు రాజేష్ దండా. అన్ని హంగులు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఈ దీపావళి కానుకగా 18న థియేటర్స లో విడుదల కానుంది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరోసారి సుపర్ హిట్ కొడతాడని ధీమాగా ఉన్నాడు.
Also Read : OTT : ఓటీటీలో ఈ వారం బెస్ట్ మూవీస్ ఏవంటే?
తాజాగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రాజేష్ దండా తొడకొట్టి మరి భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాట్రైలర్ లాంచ్ లో రాజేష్ దండా మాట్లాడుతూ ‘ మా సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అలాగే చిత్ర దర్శకుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్. నేను బాలయ్య ఫ్యాన్. నా హీరో స్టైల్ లో చెప్పాలంటే ఈ దీపావళికి వస్తున్న నాలుగు సినిమాలు ఆడాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మన తెలుగు సినిమా హీరోని మరో మెట్టు పైన ఉంచాలి. ఈ దీపావళికి ‘K’ RAMP సినిమాను ఆడియెన్స్ అందరు ర్యాంప్ ర్యాంప్ ఆడించాలని కోరుకుంటున్న’ అని అన్నారు. రాజేష్ దండా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్న విడుదలైన ‘K’ RAMP ట్రైలర్ అవుట్ అండ్ ఫన్ గా సూపర్ గా ఉంది