సెలెబ్రేటీలకు సంబంధించిన లవ్ స్టోరీలు అంటే చాలా మంది చెవులు కోసుకుంటారు.. ఆ సెలెబ్రేటీలు సీక్రెట్ లవ్ ఎఫైర్ లు, పెళ్లిళ్లు గురించి తెలుసుకోవడానికి జనాలు కూడా ఆసక్తి చూపిస్తారు. సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. ఈరోజుల్లో సామాన్యుల ఇళ్లల్లో జరిగే వివాహాలే ఎంతో ఆడంబరంగా జరుగుతున్నాయి. అలాంటిది.. సెలబ్రిటీల పెళ్లి అంటే మాటలా.. చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం.. చాలా సీక్రెట్‌గా, సింపుల్‌గా పెళ్లి పీటలు ఎక్కి.. ఆ తర్వాత తమ మ్యారేజ్ ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల చాలా జంటలు ఇదే పార్ములాను ఫాలో అవుతున్నారు.. గత ఏడాది టాలీవుడ్ బుల్లి తెర నటి ఒకరు ఇలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. అది కూడా విదేశాల్లో. ఆమె పెళ్లి ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
ఆమె ఎవరో కాదు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మెప్పించిన ప్రియాంక నల్కారి పేరు వినే ఉంటారు. .బాలనటిగా పలు సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత కూడా కొన్ని సీరియల్స్‌లో కీలక పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందింది. ఈటీవీ ప్లస్‌లో ప్రసారం అయిన ‘సినిమా చూపిస్తా మామ’ షోకి జబర్దస్త్ శ్రీనుతో కలిసి యాంకర్‌గా సందడి చేసింది. ఆ షో ప్రియాంకకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగులో సరైన అవకాశాలు లభించకపోవడంతో.. చివరికి ఆమె తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లింది. అక్కడ ఆమె పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది..
ఇదిలా ఉండగా.. తాను ప్రేమించిన అబ్బాయిని మలేషియాలోని మురుగన్ ఆలయంలో ప్రియాంక పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే.. అయితే పెళ్ళై ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకోబోతుందనే వార్తలు ఇప్పుడు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి.. ఇటీవల సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు, మీ భర్తతో విడిపోయారా అని ప్రశ్నించగా అవును అని సమాధానం ఇచ్చింది.. ఎందుకు విడిపోయారో మాత్రం చెప్పలేదు.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట మాత్రం వైరల్ అవుతుంది..