యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ఈ భామ చేతిలో ప్రస్తుతం భారీ చిత్రాలు ఉండటంతో ఈ ముద్దుగుమ్మ కు క్రేజ్ కూడా బాగా పెరిగింది.కోలీవుడ్ మూవీస్ తో ప్రియాంక మోహన్ మంచి గుర్తింపు పొందింది. ఈ భామ మొదట కన్నడ చిత్రం ‘ఒందు కథే హెల్లా’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో శర్వానంద్ సరసన ‘శ్రీకారం’సినిమాలో నటించింది.కానీ ఈ రెండు సినిమాలు ఈ భామకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేయడం ప్రారంభించింది. తమిళ్ స్టార్ హీరోస్ సూర్య, శివ కార్తీకేయన్ సరసన నటించి మెప్పించింది.
ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్ సరసన భారీ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి సినిమా లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాను నటిస్తున్న ఈ రెండు సినిమాల పై భారీగా అంచనాలున్నాయి. దీంతోఈ రెండు సినిమాలు విడుదల తర్వాత ప్రియాంక మోహన్ రేంజ్ మారిపోతుందని అంటున్నారు.ఈ క్రమంలో ప్రియాంక కూడా వరుస సినిమాలతో వెండితెరపై అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ అందాల రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరుస్తూ రెచ్చ గొడుతుంది.తాజాగా గోల్డ్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొడుతుంది..అయితే, ప్రియాంక మోహన్ మొదటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండీ వేర్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా క్యూట్ ఫోజులతో ఆకట్టుకుంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వస్తుంది.. సంప్రదాయ లుక్ లో అలాగే మోడ్రన్ లుక్ లో మెరుస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ గోల్డ్ టైట్ ఫిట్ డ్రెస్ లో ప్రియాంక లుక్స్ వైరల్ అవుతున్నాయి.