NTV Telugu Site icon

Sambal Conflict: సంభల్‌లో ఉద్రిక్తత.. యూపీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్

Sambal

Sambal

Sambal Conflict: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సంభల్‌లో గల జామా మసీదు సర్వే పనుల్లో నెలకొన్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో యూపీ సర్కార్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు హడావుడిగా చర్యలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా వివక్ష, అణచివేత, విభజన ధోరణికి పాల్పడొద్దని ఆమె సూచించారు. ఇక, సంభల్‌ ఘటనపై సుప్రీం కోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. తగిన న్యాయం చేయాలని కోరారు.

Read Also: Maharashtra CM: అజిత్ పవార్ సపోర్టుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌

కాగా, సంభల్‌లోని జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు పోలీసులపై హింసాత్మక ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరో 20 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత జిల్లాలో ఇంటర్ వరకు స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే, 24 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. ఇక, నవంబర్ 30వ తేదీ వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా అధికార యంత్రాంగం నిషేధం విధించింది.