Priyanka Gandhi: రాహుల్ దాడి బీజేపీపైనే.. వారిపై కాదు
- రాహుల్ ప్రసంగానికి ప్రియాంక మద్దతు
- రాహుల్ దాడి బీజేపీపైనే
- హిందువులపై కాదన్న రాహుల్ సోదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగించారు. దీనికి మోడీ సహా బీజేపీ ఎంపీలు మధ్యమధ్యలో అడ్డుకుంటూనే ఉన్నారు. ఇక మధ్యలో రాహుల్ మతపరమైన బొమ్మలు చూపించడంపై అమిత్ షా ఎదురుదాడి చేశారు. ఇలా సభ అంతా అధికార-ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో సభ సోమవారం హీటెక్కింది.
ఇది కూడా చదవండి: AP-TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఇదే అంశంపై ప్రియాంకగాంధీ స్పందించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలోనే హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ ఖండించారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ సైతం ఇదే విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారని అన్నారు. కేవలం బీజేపీ, ఆ పార్టీ నాయకుల గురించే రాహుల్ మాట్లాడారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Video: 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ ఏం చేశారంటే..!
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ… ప్రధాని మోడీని, బీజేపీని టార్గెట్ చేసుకుని సోమవారం విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫొటోను చూపిస్తూ, తమని తాము 24 గంటల పాటు హిందువులమని చెప్పుకునేవారిలో హింస, ద్వేషం, అసత్యం పేరుకుపోతోందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపెడుతోందని ధ్వజమెత్తారు. తమని తాము హిందువులని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు హిందువులే కారని విమర్శించారు. అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న నభా నటేష్..
ఇక రాహుల్ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో తిరిగి రాహుల్ బదులిస్తూ, నరేంద్ర మోడీ ఒక్కరే హిందూ సమాజం కాదని, అలాగే ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదని చెప్పారు. తాను కేవలం ప్రధాని మోడీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని, మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని రాహుల్ స్పష్టం చేశారు.
मेरे भाई राहुल गांधी कभी हिंदुओं का अपमान नहीं कर सकते।
उन्होंने बहुत साफ तौर पर BJP और उनके नेताओं के बारे में बोला है।
: कांग्रेस महासचिव श्रीमती @priyankagandhi जी pic.twitter.com/Wjz69hcOwk
— Congress (@INCIndia) July 1, 2024
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..