NTV Telugu Site icon

Priyanka Gandhi: రాహుల్ దాడి బీజేపీపైనే.. వారిపై కాదు

Oeke

Oeke

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగించారు. దీనికి మోడీ సహా బీజేపీ ఎంపీలు మధ్యమధ్యలో అడ్డుకుంటూనే ఉన్నారు. ఇక మధ్యలో రాహుల్ మతపరమైన బొమ్మలు చూపించడంపై అమిత్ షా ఎదురుదాడి చేశారు. ఇలా సభ అంతా అధికార-ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో సభ సోమవారం హీటెక్కింది.

ఇది కూడా చదవండి: AP-TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ..

ఇదే అంశంపై ప్రియాంకగాంధీ స్పందించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలోనే హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ ఖండించారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ సైతం ఇదే విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారని అన్నారు. కేవలం బీజేపీ, ఆ పార్టీ నాయకుల గురించే రాహుల్ మాట్లాడారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Video: 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ ఏం చేశారంటే..!

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ… ప్రధాని మోడీని, బీజేపీని టార్గెట్ చేసుకుని సోమవారం విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫొటోను చూపిస్తూ, తమని తాము 24 గంటల పాటు హిందువులమని చెప్పుకునేవారిలో హింస, ద్వేషం, అసత్యం పేరుకుపోతోందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపెడుతోందని ధ్వజమెత్తారు. తమని తాము హిందువులని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు హిందువులే కారని విమర్శించారు. అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న న‌భా న‌టేష్‌..

ఇక రాహుల్ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో తిరిగి రాహుల్ బదులిస్తూ, నరేంద్ర మోడీ ఒక్కరే హిందూ సమాజం కాదని, అలాగే ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదని చెప్పారు. తాను కేవలం ప్రధాని మోడీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని, మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని రాహుల్ స్పష్టం చేశారు.