Priyanka Gandhi: అమేథీ, రాయ్‌బరేలీలో ప్రియాంక ప్రచారం.. ఖాతాలో వేసుకుంటారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఎప్పుటినుంచో కాంగ్రెస్‌కు బలమైన స్థానాలుగా ఉన్నాయి. అయితే ఈసారి చాలా లేటుగా అభ్యర్థుల్ని ప్రకటించారు. నామినేషన్‌కు చివరి రోజు.. కొన్ని గంటల ముందు హైకమాండ్ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే ఈ స్థానాలను హస్తం పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా ఈ స్థానాలను ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో.. అనగా మే 20న పోలింగ్ జరగనుంది. అయితే ప్రచారం గడువు ముగిసే వరకు తాను ఇక్కడే ఉంటానని కార్యకర్తలకు ఆమె సందేశం ఇచ్చారు. అంటే ఈ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.
ఇది కూడా చదవండి: Shyamala Devi: ఏపీలో ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?
Also Read
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ 55 వేల ఓట్లతో విజయం సాధించారు. ఈ ఓటమి రాహుల్‌కు పెద్ద తగిలినట్లైంది. అదృష్టవశాత్తు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. అయితే ఈసారి కూడా అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ చివరికి ఆయన రాయ్‌బరేలీకి వెళ్లిపోయారు. అమేథీలో మాత్రం.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేఎల్.శర్మను రంగంలోకి దించింది. ఎంతో కాలంగా అమేథీ, రాయ్‌బరేలీలో సేవలు అందించిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అతని వైపు మొగ్గు చూపింది. ఇక సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇక్కడ ప్రియాంక పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి.. కానీ ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఇక్కడ రాహుల్ గాంధీనే బరిలోకి దిగారు. అయితే ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో వీటి గెలుపు బాధ్యతను ప్రియాంక తన భుజాన వేసుకుంది.
ఇది కూడా చదవండి: Mumbai: ఇండియాకు పాకిన పాలస్తీనా నినాదం.. స్కూల్ ప్రిన్సిపాల్ తొలగింపు
అందుకోసమే అమేథీ, రాయ్‌బరేలీలో ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలతో దూసుకెళ్తున్నారు. అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 24 గంటలూ కార్యకర్తలతోనే ఉండి జోష్ నింపుతున్నారు. బుధవారం ఒక్క రోజే ఆమె తొమ్మిది సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. మే 18 వరకూ తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని పార్టీ నేతలకు ఆమె స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Kalki 2898AD: కల్కి అమితాబ్ లుక్ తో టీ20 WC స్పెషల్ వీడియో.. అదిరిపోయింది బ్రో..
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?