NTV Telugu Site icon

Himachal Pradesh: సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రియాంకదే తుది నిర్ణయం!

Priyanka Gandhi

Priyanka Gandhi

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిమాచల్‌లో 68 సీట్లలో 40 గెలిచిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం సతీమణి ఎంపీ ప్రతిభా సింగ్, సిక్విందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్ని హోత్రిలు ఉన్నారని తెలుస్తోంది. అధిష్ఠానానికి అధికారం ఇవ్వగా.. ఆదివారం నాటికి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించారు, కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు, అనేక ర్యాలీలతో పాటు, ఎన్నికల కోసం వ్యూహాల ప్రణాళికలో కూడా నిమగ్నమై ఉన్నారు. పార్టీకి విజయాన్ని అందించడంలో, బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఓడించడంలో ఆమె నాయకత్వాన్ని పలువురు నాయకులు కొనియాడారు. ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీకి ఇది తొలి ఎన్నికల విజయం. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమె నాయకత్వం వహించగా పార్టీ ఓడిపోయింది. సిర్మూర్, కాంగ్రా, సోలన్, ఉనాలో తన ర్యాలీలలో, ప్రియాంక గాంధీ అగ్నిపథ్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పాత పెన్షన్ స్కీమ్ సమస్యలను లేవనెత్తారు. శుక్రవారం సాయంత్రం సమన్వయం కోసం కేంద్ర పర్యవేక్షకులు రాజీవ్ శుక్లా, భూపిందర్ హుడా, భూపేష్ బఘేల్‌లు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రతి ఎమ్మెల్యేతో ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో అంచనా వేసేందుకు మాట్లాడారు.

Gujarat Elections 2022: గుజరాత్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక ముస్లిం

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ ప్రతిభా సింగ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె మద్దతుదారులు ఆందోళన చేపట్టిన అనంతరం హైకమాండ్‌కు అధికారం ఇస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కారును కూడా అడ్డుకున్నారు. మూడుసార్లు ఎంపీగా ఉన్న ప్రతిభా సింగ్, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య సీఎం పదవికి అర్హులు అంటూ డిమాండ్ చేశారు. ఆమెతో పాటు సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రిలు కూడా రేసులో ఉన్నారు,

Show comments