Priyanka Gandhi: చండీగఢ్ ఉదంతంపై ప్రియాంక కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్ ఉదంతంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ రిట్నరింగ్ అధికారిని ఉద్దేశిస్తూ ధర్మాసనం సంచలన వ్యా్ఖ్యలు చేసింది. మేయర్ ఎన్నిక నిర్వహించేది ఇలానేనా? అంటూ నిలదీసింది. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారా? అంటూ న్యాయస్థానం మండిపడింది. తాజాగా ఇదే అంశంపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు.
ప్రియాంక ట్వీట్..
చండీగఢ్ ఉదంతాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల మోసాన్ని ధర్మాసనం ఖండించిందని.. ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేసినట్లుగా చీవాట్లు పెట్టిందని గుర్తుచేశారు. ప్రజల గొంతును అణిచివేసేందుకు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని.. ప్రజలు దీనికి సమాధానం చెబుతారని ప్రియాంక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో (Chandigarh Mayoral polls) బీజేపీకి బలం లేకపోయినా పీఠాన్ని కైవసం చేసుకుంది. రిటర్నింగ్ అధికారి కుయుక్తితో తిమ్మిని బమ్మిని చేసి సునాయాసంగా మేయర్ పదవి దక్కించుకుంది. దీంతో ఆప్, కాంగ్రెస్ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును పట్టించుకోకపోవడంతో సుప్రీం మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా పిటిషన్ విచారిస్తూ రిటర్నింగ్ అధికారి తీరుపై న్యాయస్థానం మండిపడింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికపై (Chandigarh Mayor Elections) దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి తీరుపై (Returning Officer) ఫైర్ అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన వీడియోగ్రఫీ సహా అన్ని బ్యాలెట్ పత్రాలు, ఇతర ఒరిజినల్ రికార్డులను పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశాడని స్పష్టంగా తెలుస్తోంది? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయడాన్ని అనుమతించబోమంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 7న జరగాల్సిన చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జిమ్మిక్ జరిగింది. ఇండియా కూటమిగా బరిలో దిగిన ఆప్, కాంగ్రెస్ పార్టీలకు 20 మంది (13+7) కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి చెందిన మనోజ్ కుమార్ సోలంకి కేవలం 16 ఓట్లే ఉన్నాయి. కానీ బీజేపీ అభ్యర్థే మేయర్‌గా ఎన్నికయ్యాడు. దీంతో ఇండియా కూటమి అవాక్కైంది.
ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు 20 మంది మద్దతు ఉన్నా.. 12 ఓట్లే వచ్చాయి. కూటమికి చెందిన 8 ఓట్లు చెల్లలేదని అధికారి ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఆప్, కాంగ్రెస్ సభ్యులు కార్పొరేషన్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి తీరుపై మండిపడ్డారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టి ప్రిసైడింగ్ అధికారి తీరుపై మండిపడింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!