Site icon NTV Telugu

Priyanaka Chopra: ఇక తగలబెడదామా.. మందాకిని దూకుడు మాములుగా లేదుగా..!

Priyanka Chopra Varanasi

Priyanka Chopra Varanasi

Priyanaka Chopra: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సంబంధించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మొత్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఈవెంట్‌కు చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కు పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని చెప్పిన భారీ ఈ అభిమానులు కేరింతలు కొట్టారు.

SS Rajamouli: టెస్టింగ్‌ కోసం ప్లే చేసిన వీడియో లీక్‌.. ఈవెంట్లో రాజమౌళి అసహనం

ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె తెల్లటి లెహంగా దుస్తుల్లో సంప్రదాయ ఆభరణాలను జోడించి ఎంతో అందంగా, మంత్రముగ్ధులను చేసే విధంగా కనిపించారు. ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. మొదటగా ఇక తగలబెడదామా అంటూ.. హలో హైదరాబాద్ అని ప్రసంగాన్ని మొదలు పెట్టింది. ఈరోజు ఇక్కడ చాలామంది అభిమానులు వచ్చారని.. మీఅందరిని చూస్తుంటే చాలా సంతోషంగా వేస్తోంది.. మీ అందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపింది. నేను తిరిగి ఇండియన్ సినిమాల్లోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా ఈ సినిమా ద్వారా రావడం ఎంతో ఆనందం వేస్తుందని తెలిపింది. నేను చాలా లక్కీ అనుకుంటున్నాను.. ఎందుకంటే, చాలా పెద్ద స్టార్స్ తో ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి అని చెప్పుకొచ్చింది.

ఇక మొదటగా కీరవాణి గురించి మాట్లాడుతూ.. ‘దేశీ గర్ల్’ వర్షన్ తనకి ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే ‘సంచారి’ పాటను హీరోయిన్ శృతి చాలా బాగా పాడిందని మెచ్చుకుంది. అలాగే విలన్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమార్ గురించి మాట్లాడుతూ తను సినిమాలు చాలా భయ పెట్టేసాడని చెప్పుకొచ్చింది. అయితే రియల్ లైఫ్ లో తాను దీనికి చాలా వ్యతిరేకమని తెలిపింది.

PM Modi: కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు..

ఇక సినిమా దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఒక సినిమాను గ్లోబల్ వ్యాప్తంగా తీసుకువెళ్లాలంటే అది రాజమౌళికి మాత్రమే సాధ్యమంటూ పొగడ్తలతో మంచిదేంది. ఇలాగా ఇదివరకు ఎప్పుడూ చూడలేదని.. ఇది మీకు మాత్రమే సాధ్యమం అంటూ ఆయనను మెచ్చుకుంది. ఇక హీరో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. లెజెండరీ మహేష్ బాబు అని సంబోధిస్తూ.. మీరు మీ ఫ్యామిలీ తనని ఎంత బాగో చూసుకున్నారని.. హైదరాబాదును తన సొంత ఇంటి లాగా మార్చేశారు అంటూ తెలిపింది. ఇక చివరగా, నాకు తెలుగు అంతగా రాదు కానీ.. సినిమా రిలీజ్ అయ్యే లోపల తాను స్పీచ్ తెలుగులో పూర్తిగా ఇస్తానని తెలిపింది.

Exit mobile version