Site icon NTV Telugu

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక ట్రిపుల్ ధమాకా.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్!

Priyanka Chopra

Priyanka Chopra

సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతుంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైమ్ ట్రావెల్.. మైథాలజీ నేపథ్యంలో ఉండబోతోందని స్పష్టమైంది. అయితే ప్రియాంక ప్రజెంట్ బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్‌లో ధూసుకుపొతుండగా..

Also Read : Naveen Polishetty : మైత్రీ బ్యానర్‌లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!

ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోందనే వార్త ఇప్పుడు నిజమైంది. హృతిక్ రోషన్ హీరోగా, స్వయంగా ఆయనే దర్శకత్వం వహించనున్న ‘క్రిష్ 4’లో నటించేందుకు ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వచ్చిన ‘క్రిష్’ సిరీస్‌లో ప్రియా నటించిన ‘ప్రియ’ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాతే ఆమెకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నాలుగో భాగం అంతరిక్షం.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతోందట. హృతిక్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడం, ప్రియాంక రాకతో బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027లో ఈ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకులను అలరించనున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version