Site icon NTV Telugu

Varanasi: రాజమౌళి వల్లే అది సాధ్యమైంది.. ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

Varanasi

Varanasi

రాజమౌళి-మహేష్ బాబుల క్రేజీ కాంబోలో వస్తున్న ‘వారణాసి’ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు ‘రుద్ర’గా కనిపిస్తుండగా, విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చిన కూడా నిమిషంలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రియాంక, ఈ సినిమాలో నటించడం తన కెరీర్‌లోనే ఒక విభిన్నమైన అనుభవమని పేర్కొన్నారు. ముఖ్యంగా..

Also Read : Aavesham 2: రంగన్న ఈజ్ బ్యాక్! ‘ఆవేశం 2’పై ఫహద్ ఫాజిల్ అఫీషియల్ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?

తెలుగు భాష రాకపోవడం తనను ఇబ్బంది పెట్టినప్పటికీ, రాజమౌళి సహకారంతో దాన్ని అధిగమిస్తున్నట్లు తెలిపారు. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ‘వారణాసి సినిమాలో నటించడం నాకు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. నిజం చెప్పాలి అంటే నాకు తెలుగు అస్సలు రాదు, అర్థం కూడా కాదు. కేవలం డైలాగులను అక్షరాలా గుర్తుపెట్టుకుని పలుకుతున్నాను. సెట్‌లో ఒక్కసారిగా డైలాగ్స్ మారిస్తే నాకు చాలా కష్టమవుతుంది. అలాంటి సమయంలో రాజమౌళి సర్ నాకు అండగా నిలుస్తారు. ప్రతి మాట అర్థం, భావం వివరించి అది ఏ టోన్‌లో చెప్పాలో ఆయన వివరంగా చెబుతారు. కొన్నిసార్లు డైలాగ్ అర్థం చేసుకోవడానికి పది నిమిషాలు సమయం తీసుకుని, నా స్టైల్‌లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నాకు ఒక అదనపు పెర్ఫార్మెన్స్ లేయర్ లాంటిది’ అని వివరించారు. తన తోటి నటుడు పృథ్వీరాజ్‌కు కూడా తెలుగు రాదని, కానీ తనకంటే ఆయనే కొంచెం బెటర్ అని ప్రియాంక సరదాగా వ్యాఖ్యానించారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుండగా.. ఈ విజువల్ వండర్ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version