బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజ్ అందుకున్న నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలీవుడ్ నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమెఆ తరువాత హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.హాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా స్థిరపడిన ప్రియాంక చోప్రా పలు సినిమాలు వెబ్ సిరీస్లో చేస్తూ మెప్పిస్తుంది.. ఇక ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు మాల్టీ మేరీ అనే ఒక కుమార్తె కూడా ఉంది. ప్రియాంక చోప్రా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తల్లిగా కూడా తన కూతురి పట్ల కూడా అంతే బాధ్యతగా ఉంటారు.నిత్యం సోషల్ మీడియాలోఎంతో యాక్టివ్ గా ఉంటూ తన కూతురికి సంబంధించిన అన్ని ఫోటోలు వీడియోలను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది .
ఈ విధంగా తన కుమార్తెకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ప్రియాంక చోప్రా తాజాగా తాను తల్లి అయిన తర్వాత తనలో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేను తల్లిగా మారిన తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చిందని ఆమె తెలియజేశారు.. అమ్మగా మారిన తర్వాత నా మనస్తత్వమే మారిపోయిందని ప్రియాంక చోప్రా వెల్లడించారు. చాలా మంది తల్లులు మాదిరిగానే మొదట్లో నాకు ఎన్నో సందేహాలు కలిగేవి అయితే అమ్మగా మారిన తర్వాత తనలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, దేనినైనా అలవోకగా సాధించగలను అనే నమ్మకం తనలో ఉందని ప్రియాంక చోప్రా తెలిపారు. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తూ ఎంతో ధైర్యాన్ని నాలో నింపారు..ఇప్పుడు నేను కూడా నా కూతురికి అదే నేర్పించబోతున్నానని నా కూతురిని పెంచడంలో అది నాకు ఎంతో సహాయంగా నిలిచిందని ఈ సందర్భంగా ప్రియంకా చోప్రా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.