Operation Sindoor: అంతర్జాతీయ ద్రవ్య నిధా లేక ‘ఉగ్రవాద నిధా’? పాక్ కు IMF నిధులు ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
- పాక్ కు IMF నిధులు ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
- అంతర్జాతీయ ద్రవ్య నిధా లేక 'ఉగ్రవాద నిధా'?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత త్రివిధ దళాలు పాక్ ను చావుదెబ్బ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి పాక్ కు లోన్ ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధినా లేక ఉగ్రవాద నిధా అంటూ పాక్ కు నిధుల విడుదలపై ఆమె మండిపడింది. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ తో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు సరైన బుద్ధి చెప్తోంది.
Also Read:Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత సైన్యం అత్యవసర మీడియా సమావేశం..
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ఒక బిలియన్ డాలర్ల కొత్త రుణం పొందినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ రుణం గురించి శివసేన (UBT) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది IMF ను ఉగ్రవాద నిధుల సంస్థగా అభివర్ణించారు. IMF నుంచి పాకిస్తాన్ అందుకున్న నిధుల గురించి ప్రియాంక చతుర్వేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ట్వీట్ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి పేరును అంతర్జాతీయ ఉగ్రవాద నిధిగా మార్చాలని ప్రియాంక అన్నారు. IMF ఒక ఉగ్రవాద దేశానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడానికి అవకాశం ఇస్తోంది. ఇది సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యింది.
Also Read:Operation Sindoor Live Updates: పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు…
పాకిస్తాన్ డ్రోన్ దాడుల సంఘటనల తరువాత కచ్, జలంధర్ సహా సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. కచ్ జిల్లాలో పూర్తి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. జలంధర్‌లో ముప్పు పొంచి ఉన్న తర్వాత, డిప్యూటీ కమిషనర్ మళ్ళీ విద్యుత్తు సరఫరా నిలిపివేతకు ఆదేశించారు. ఈ సంఘటనలకు ప్రతిస్పందనగా, భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల్లోని 30 కి పైగా విమానాశ్రయాలను మే 14 వరకు మూసివేసింది.
Also Read:Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..
భారత భద్రతా దళాలు పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులను భగ్నం చేశాయి. శుక్రవారం సాయంత్రం, పాకిస్తాన్ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని 26 నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ దాడుల తర్వాత, జమ్మూ, సాంబా, రాజౌరి, నగ్రోటా, పూంచ్, అఖ్నూర్, ఉధంపూర్, బారాముల్లా, ఫిరోజ్‌పూర్, అమృత్సర్ వంటి నగరాలు ప్రభావితమయ్యాయి.
International Monetary Fund should be renamed to International Terrorist Fund for financially aiding, abetting and encouraging an aatanki nation to build more terror gangs to export to the world. Shame!
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) May 9, 2025
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!