ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.దీనితో పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ లో అంతకి మించిన కథతో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.. పుష్ప మొదటి భాగంలో బన్నీ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సుకుమార్ పుష్ప 2 ని రూపొందిస్తున్నారు.
రెండవ భాగంలో కొంతమంది కొత్త నటీనటులు కనిపించబోతున్నారు.. కథకి తగ్గట్లుగా సుకుమార్ ఆ పాత్రలని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.. అయితే ఈ క్రమంలో కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. క్రేజీ నటి ప్రియమణి పుష్ప 2 లో కీలక పాత్రలో నటిస్తోంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.మాక్సిమం అఫీషియల్ న్యూస్ గా ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.. దీనితో ప్రియమణి ఎలాంటి పాత్రలో నటిస్తోంది అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. ప్రియమణి షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ లో ఒక ముఖ్య పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె జవాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 చిత్రం గురించి ఆమె ఓపెన్ అయింది. తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చింది.ప్రియమణి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ చిత్రంలో ఛాన్స్ వస్తే నేను అస్సలు వదులుకోను. కానీ పుష్ప 2 కోసం నన్ను చిత్ర యూనిట్ సంప్రదించలేదు అని పేర్కొంది. తాను పుష్ప 2లో నటించడం లేదు అని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది