Site icon NTV Telugu

Mega #158 : బాబీ – చిరు మూవీలో మెగాస్టార్‌కు జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ!

Chiranjeevi , Boby Movie

Chiranjeevi , Boby Movie

మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిరు, ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తన 158వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరిగే కథ అని, ఇందులో చిరు కూతురిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : Allu Arjun& NTR : సైలెన్స్ వీడాలి.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!

తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి ప్రియమణి ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు, కాబట్టి ఈ సరికొత్త జోడి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రియమణి చిరంజీవి భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అలాగే, మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version