ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటు వీడియో తో బాగా పాపులర్ అయింది. ఓవర్ నైట్ లో స్టార్ గా మారింది ఈ భామ.దీనితో ఈ భామ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ భామ ఇప్పటికే తెలుగులో ‘చెక్’, ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో నటించింది.అలాగే లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రంలో హీరోయిన్ గా ఈ మలయాళీ ముద్దుగుమ్మ నటించింది. సినిమాలో తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలుగు లో కాస్త గ్యాప్ తర్వాత ‘బ్రో : ది అవతార్’సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..బ్రో సినిమా లో ఈ భామ చిన్న పాత్ర లో నటించనప్పటికీ సినిమాలో కీలక పాత్ర లో నటించినందుకు ప్రియా ప్రకాష్ వారియర్ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.
సినిమాల పరంగా మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ కు ఎలాంటి ఇబ్బంది లేదు.వరుస సినిమాలలో నటిస్తూ ఎప్పుడూ బిజీ గా ఉంటుంది. కానీ తన కెరీర్ ను మలుపు తిప్పే సినిమా కోసం ఈ భామ ఎంతగానో ఎదురు చూస్తుంది..అయితే ప్రస్తుతం ఈ భామ హిందీ లో ‘3 మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’, ‘శ్రీదేవి బంగ్లా’ మరియు ‘యారియన్ 2’, అలాగే కన్నడ లో ‘విష్ణు ప్రియా’ వంటి సినిమాల్లో నటిస్తోంది.ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాలలో నే కాకుండా సోషల్ మీడియా లో కూడా తన అందాలతో రెచ్చగొడుతుంది.తాజాగా ఈ భామ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది.ఈ మలయాళీ భామ చుడీదార్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. చున్నీ తీసేసి తన ఎద పై ఉన్న టాటూ ను చూపిస్తూ రెచ్చగొట్టింది..స్టన్నింగ్ ఫోజులిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.