నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సిరువెళ్ల మెట్ట పై ARBCVR ట్రావెల్స్ బస్సు, లారీ దగ్ధం అయ్యాయి. బస్సు, లారీ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మంటల్లో మృతి, బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి చెందాడు. పలువురికి గాయాలు అయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే అటుగా వెళ్తున్న వాహనదారులు అద్దాలు పగలగొట్టడంతో బయటికి వచ్చారు బస్సులోని ప్రయాణీకులు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
Also Read:IND T20 Records: టీ20ల్లో భారత్ అరుదైన రికార్డు.. ఏకంగా 44 సార్లు, ఏ జట్టుకు సాధ్యం కాలే!
సిరువెళ్ల బస్, లారీ దగ్ధం ఘటనలో శ్రీవాణి ఆటో మొబైల్స్ కంటైనర్ లారీ(Ap39tp0626)లో బైక్ లు రవాణా చేస్తూ దగ్ధం అయ్యింది. ARBCVR ట్రావెల్స్ బస్సు( NL02B4647) దగ్ధం. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణీకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ప్రయాణీకులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ ఓబులేసు అలియాస్ భాస్కర్, (50) సజీవ దహనం అయ్యారు. కడప నివాసిగా గుర్తించారు. మృతిచెందిన లారీ డ్రైవర్, క్లీనర్ లను ఇంకా గుర్తించలేదు.
Also Read:Donald Trump: “గ్రీన్‌ల్యాండ్” అమెరికా భూభాగమే.. దావోస్‌లో ట్రంప్ ఫైరీ స్పీచ్..
నంద్యాల జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న ఆరుగురు సిరువెళ్ల బస్సు దగ్ధం బాధితులు.. ఇద్దరికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. నంద్యాల ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఎస్పీ సునీల్ షెరాన్.. బాధితుల నుంచి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. బస్సు దగ్ధం ఘటనలో గాయపడిన వారు హైద్రాబాద్ వాసులున్నారు.. చికిత్స పొందుతున్న శ్రీనివాసరెడ్డి, హరీష్, సునీత, గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు హైద్రాబాద్ కు పంపించారు. సిరువెళ్ల బస్సు దగ్ధమైన ఘటన లో ప్రయాణీకుల ప్రాణాలు కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్. క్లీనర్ అప్రమత్తం కాకుంటే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలిసేవని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణీకులు. క్లీనర్ ను అభినందించిన పోలీసులు. ప్రయాణీకులను కాపాడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ సురేంద్ర.
