Site icon NTV Telugu

PM Modi: ప్రధాని కీలక నిర్ణయం.. కోటి ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు నిర్ణయం

Solar

Solar

రామనగరి అయోధ్య నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కోటి ఇళ్లకు సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. కాగా.. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లు తగ్గుతుందని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు ఇంధన రంగంలో కూడా భారతదేశం స్వావలంబన సాధిస్తుందని తెలిపారు.

Read Also: ICC: ఐసీసీ టీ20 జట్టు ప్రకటన.. కోహ్లీ, రోహిత్ శర్మకు దక్కని చోటు

ఇదిలా ఉంటే.. శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం ముగిసింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సమక్షంలో పవిత్రోత్సవం నిర్వహించారు. రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన తర్వాత తన ట్వీట్ లో “ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ సూర్యవంశ భగవంతుడు శ్రీరాముని కాంతి నుండి శక్తిని పొందుతారు. ఈ రోజు అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన సందర్భంగా.. భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై వారి స్వంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది”. అని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు.

Read Also: Deepotsavam: అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవం..

Exit mobile version