NTV Telugu Site icon

PM Modi South Visit: నేడు సౌత్ ఇండియాలో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..

Modi

Modi

Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి మూడు రాష్ట్రాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నేటి ఉదయం 10.45 గంటలకు మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన ఎనిమిది అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 90 వేలకు పైగా ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇక, షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను లబ్ధిదారులకు ప్రధాని అందజేయనున్నారు. ఈ లబ్ధిదారులలో వేలాది మంది చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు, ర్యాగ్ పికర్స్, బీడీ కార్మికులతో పాటు డ్రైవర్లు ఉన్నారు.

Read Also: Guntur Kaaram: 7 రోజుల్లో 212 కోట్లు… అతన్ని ఆపగలిగే ఫోర్స్ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర లేదు

అనంతరం ప్రధాని మోడీ మధ్యాహ్నం 2:45 గంటలకు కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో అమెరికా విమానాల తయారీ కంపెనీ బోయింగ్‌కు చెందిన కొత్త గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రూ.1,600 కోట్లతో 43 ఎకరాల్లో నిర్మించిన అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (బీఐఈటీసీ) క్యాంపస్ అమెరికా వెలుపల కంపెనీ చేస్తున్న అతిపెద్ద పెట్టుబడి అని ఆయన చెప్పారు. బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలోని ఈ ‘హై-టెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్’ క్యాంపస్ ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. అత్యాధునిక ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలోకి ఎక్కువ మంది బాలికలు ప్రవేశించేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ‘బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్’ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

Read Also: Shavarma: షవర్మా తిని 17 మందికి తీవ్ర అస్వస్థత.. అల్వాల్ గ్రిల్ హౌజ్ బంద్

ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన తర్వాత.. పీఎం మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మరో రెండు రోజుల పాటు (జనవరి 20 మరియు 21) ప్రధాని మోడీ తమిళనాడులోని పలు ముఖ్యమైన ఆలయాలను సందర్శించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మోడీ రామేశ్వరం వెళ్లనున్నారు. రామేశ్వరంలోని శ్రీ అరుల్మిగు రామనాథస్వామి ఆలయంలో జరిగే భజన సంధ్యలో కూడా పాల్గొంటారు. ఎల్లుండి (జనవరి 21న) ధనుష్కోడిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రధాని మోడీ పూజలు చేయనున్నారు. రామసేతు నిర్మించిన ప్రదేశంగా చెప్పబడుతున్న ధనుష్కోడి సమీపంలోని అరిచల్ మునైని కూడా మోడీ సందర్శించబోతున్నారు.

Show comments