Site icon NTV Telugu

PM Modi: మాతృదినోత్సవం సందర్భంగా మోడీకి గిఫ్ట్.. థ్యాంక్స్ చెప్పిన ప్రధాని

Art

Art

మాతృదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి ఊహించని బహుమానం దొరికింది. మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్‌ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీంతో ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్‌ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీంతో వారికి మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఈ అరుదైన సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Video viral: వందే భారత్ రైలు కింద చిక్కుకున్న ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు తన తల్లితో ఉన్న చిత్రాలను ప్రదర్శించారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మోడీ.. ఆ చిత్రాలను ఎస్‌పీజీ సిబ్బందికి అందించాలని సూచించారు. అలాగే ఆ చిత్రపటం వెనుక వారివారి చిరునామాలు కూడా రాయాలని సూచించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉందన్నారు. పాశ్చాత్య దేశాల్లో మదర్స్‌ డేను ప్రత్యేకంగా నిర్వహించుకుంటారని, మన దేశంలో తల్లిని నిత్యం దేవతలా కొలుస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sreemukhi: శ్రీముఖి పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్‌ కామెంట్స్.. ఈ ఏడాదే అంటూ?

ఇదే సభలో సందేశ్‌ఖాలీ ఘటనపై ప్రధాని మోడీ తృణమూల్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సందేశ్‌ ఖాలీ నిందితులను తొలుత పోలీసులు రక్షించాలని చూశారని, ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్సే నేరుగా రంగంలోకి దిగిందని దుయ్యబట్టారు. సందేశ్‌ఖాలీలో సోదరీమణులను తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ఇదిలా ఉంటే బెంగాల్‌కు 5 గ్యారంటీలు మోడీ ప్రకటించారు. తాను అధికారంలో ఉన్నంత కాలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరన్నారు. అయోధ్యలో రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చలేరని చెప్పారు. రామ నవమి పూజలను చేసుకోకుండా ఆపలేరని… సీఏఏ అమలును అడ్డుకోలేరని ప్రధాని మోడీ బెంగాల్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీరాముడిని పూజిస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రజలను బెదిరిస్తోందని, రామనవమి వేడుకలకు అనుమతించట్లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ రామ మందిర నిర్మాణాన్నే వ్యతిరేకించిందని విమర్శించారు. దేశాన్ని అలాంటి వారి చేతిలో పెడదామా అని మోడీ ప్రజలను ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Kareena Kapoor: ఆ పదం వాడినందుకు కరీనా కపూర్ కు షాక్?

Exit mobile version