NTV Telugu Site icon

PM Modi :జార్ఖండ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తా.. విజయోత్సవ వేడుకలో మోడీ

Pm Modi

Pm Modi

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అధికార మహాయుతి గెలుపు స్పష్టమైంది.  కాగా, ఎంవీఏ ప్రస్తుతం 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని 288 స్థానాలకు అక్టోబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరిగింది. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో 65 శాతానికి పైగా ఓటింగ్ జరగడంతో 30 ఏళ్ల రికార్డు బద్దలైంది.

ప్రధాన కార్యాలయంలో మోడీ ప్రసంగం..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రసంగం ప్రారంభించారు. కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధికి ఓట్లు వేశారని ప్రధాని మోడీ అన్నారు. మహారాష్ట్రలో సామాజిక, సుపరిపాలన, న్యాయం గెలిచాయని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలే బయటపెట్టారన్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగంపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. జార్ఖండ్ ప్రజలకు నేను కూడా సెల్యూట్ చేస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు జార్ఖండ్ సత్వర అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ‘కలిసి ఉంటే మనం సురక్షితంగా ఉంటాం’ అనేది దేశానికి గొప్ప మంత్రంగా మారిందన్నారు. హర్యానా తర్వాత ఈ ఎన్నికల అతిపెద్ద సందేశం ఐక్యత అని ప్రధాని అన్నారు.

ఇత రాష్ట్రాల్లోను బీజేపీ ఘటన విజయం..
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. “ఈ రోజు చాలా రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లు బీజేపీకి గట్టి మద్దతు ఇచ్చాయి. అసోం ప్రజలు మరోసారి బీజేపీపై విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోనూ విజయం సాధించాం. బీహార్‌లో ఎన్‌డిఎకు మద్దతు పెరిగింది. ఇది ఇప్పుడు దేశం అభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని చూపిస్తుంది.” అని పేర్కొన్నారు.

‘ఏక్ రహేతో సేఫ్ అహే’ అని నినదించిన మోడీ
‘ఏక్ రహేతో సేఫ్ అహే’ అనే నినాదాన్ని ప్రధాని మోడీ మరోసారి ప్రస్తావించారు. గత 50 ఏళ్లలో కూటమికి ఇదే అతిపెద్ద విజయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ నాయకత్వంలో మహారాష్ట్ర కూటమిని ఆశీర్వదించడం ఇది వరుసగా మూడోసారని.. దీంతో పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చారిత్రాత్మకమైనదని.. బీజేపీ పాలనా నమూనాపై ఆమోద ముద్ర వేయబడిందన్నారు. సుపరిపాలన విషయంలో దేశం బీజేపీని, ఎన్డీయేను మాత్రమే విశ్వసిస్తుందని దీన్నిబట్టి అర్థమవుతోందని స్పష్టం చేశారు.