NTV Telugu Site icon

PM Modi: బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

Modi

Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో నేడు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో పొహరాదేవికి వెళ్లారు. వాషిమ్ జిల్లాలోని పోహరాదేవిలో ఉన్న జగదాంబ మాత ఆలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోడీ సంప్రదాయ డ్రమ్ వాయిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పొహరాదేవిలోని సమాధి వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్‌రావ్ మహారాజ్‌లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.

Reliance Jio: బంపర్ ఆఫర్.. రూ.175లకే 12 ఓటీటీలు

దీని తరువాత, ప్రధాని మోడీ బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించాడు. బంజారా కమ్యూనిటీ వారసత్వ వేడుకలో కూడా పాల్గొన్నారు. వాషిమ్ తర్వాత, ప్రధాని మోదీ థానే, ముంబైలను కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో 32,800 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహీన్ యోజన లబ్ధిదారులను కూడా ఆయన సత్కరిస్తారు. దీని తరువాత, మోడీ BKC మెట్రో స్టేషన్ నుండి JVLR, ముంబై మధ్య నడిచే మెట్రో రైలును సాయంత్రం 6 గంటలకు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా BKC – శాంటాక్రూజ్ స్టేషన్ మధ్య మెట్రోలో ప్రయాణిస్తారు.

Ravichandran Ashwin: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన

ఇక ప్రధానమంత్రి 9.4 కోట్ల మంది రైతులకు సుమారు రూ. 20,000 కోట్లతో ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను విడుదల చేస్తారు. దీంతో సమ్మాన్ నిధి కింద రైతులకు విడుదల చేసిన మొత్తం రూ.3.45 లక్షల కోట్లు అవుతుంది. ‘నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ 5వ విడతను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దీని కింద దాదాపు రూ.2,000 కోట్లు విడుదల చేయనున్నారు.