NTV Telugu Site icon

PM Modi: వెయ్యేళ్ల అభివృద్ధికి పునాదులు వేస్తాం..

Pm Modi

Pm Modi

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పదవీకాలంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. తొలి టర్మ్‌లో అభివృద్ధి పథంలో కాంగ్రెస్‌ సృష్టించిన గుంతలను పూడ్చడానికే కాలయాపన చేయాల్సి వచ్చిందన్నారు. అప్పుడు దేశాభివృద్ధికి పునాది వేశాం, రెండో టర్మ్‌లో దేశం వేగంగా ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు.

PM Modi: దర్యాప్తు సంస్థలపై విపక్షాల విమర్శలకు మోడీ కౌంటర్

మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ.. అని ప్రధాని తెలిపారు. భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం మొత్తం అభినందిస్తోందని.. జి20 సమ్మిట్‌లో ప్రపంచం మొత్తం భారతదేశం కోసం ఏమి చెబుతుందో, ఏం చేస్తుందో చూసిందని అన్నారు. నేడు బలమైన ఆర్థిక వ్యవస్థ, దేశం యొక్క వేగవంతమైన అభివృద్ధిని చూసి నేను చెబుతున్నాను.. మూడో టర్మ్‌లో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అన్నారు.

PM Modi: రేపు గోవాలో ప్రధాని పర్యటన.. ‘ఇండియా ఎనర్జీ వీక్’ను ప్రారంభించనున్న మోడీ

మూడో టర్మ్‌లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని మోడీ చెప్పారు. సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయి. మూడో టర్మ్‌లో వెయ్యేళ్ల అభివృద్ధికి సరిపడా పునాదులు వేస్తామన్నారు. అందుకు కేవలం 100-250 రోజులు మాత్రమే ఉన్నాయన్నారు. మరోవైపు.. భారత్ సాధిస్తున్న విజయాలను కాంగ్రెస్ తక్కువ చేసి చూపుతోందని, తాము ఏ పథకం అమలు చేసినా రద్దు చేస్తామంటోందని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను గాంధీ కుటుంబం చాలా చిన్నచూపు చూసిందని విమర్శించారు. ఇప్పుడు కూడా వాళ్ల తీరు మారలేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show comments