NTV Telugu Site icon

Kejriwal: గత తొమ్మిదేళ్లుగా మౌనంగానే ఉన్నారు.. ప్రధానిపై కేజ్రీవాల్ ఆగ్రహం

Kejrival

Kejrival

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైనా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గత 9 ఏళ్లుగా చైనా భారత్‌పై కన్నేసిందని.. అయితే ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా ఆయన నోటి నుంచి చైనా అనే పదం కూడా రాదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “చైనా అధ్యక్షుడు 2019 అక్టోబర్‌లో భారతదేశానికి వచ్చినట్లు తనకు గుర్తుందని.. తమిళనాడులోని మహాబలేశ్వర్‌లో, మోడీ.. జిన్‌పింగ్ చేయి చేయి కలిపి నడవడం చూశామన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అయితే 2020 జూన్ 15న గాల్వన్ లోయలో చైనా సైన్యం మన సైనికులపై దాడి చేసి 20 మంది సైనికులను హతమార్చిందని కేజ్రీవాల్ గుర్తుచేశారు.

Jailer: వర్మ ప్లే లిస్ట్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి చనిపోయాడని మీకు తెలుసా.. ?

మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీని ఉద్దేశించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. గత 9 ఏళ్లలో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మౌనంగానే ఉన్నారని విమర్శించారు. మణిపూర్‌లో 6500 కేసులు నమోదయ్యాయని, వేలాది మంది ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చిందని, 150 మంది మరణించారని.. సైన్యం, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మణిపూర్ అల్లర్ల ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. మ‌ణిపూర్ కాలి పోతుంటే ప్రధాని మోడీ, బీజేపీ శ్రేణులు ఎలా మౌనంగా ఉన్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. ప్రధాని ఈశాన్య ప్రాంతాలకు చాలాసార్లు వెళ్లినట్లు బీజేపీ వాళ్లు చెబుతున్నారని, ఇప్పుడు ఎందుకు వెళ్లలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తండ్రి లాంటి ప్రధాని మణిపూర్ కూతుళ్లకు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.

Bandaru Vijayalakshmi: పార్టీల చూపు బండారు విజయలక్ష్మి వైపు ..!?

మరోవైపు కొన్ని రోజుల క్రితం జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు కూర్చుని న్యాయం కోసం ధర్నా చేశారని అన్నారు. వాళ్లు పతకాలు గెలిచి వచ్చిన తర్వాత వారితో వారి ఫోటోలు తీసుకుంటారు. కానీ వారికి న్యాయం ఎందుకు జరగలేదు.. వారు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లా్ల్సి వచ్చిందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని నెహ్రూను బీజేపీ శాపనార్థాలు పెడుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు.