Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Praveen Kumar Car Accident Former Team India Bowler Praveen Kumar Narrow Escape From Car Accident In Meerut

Praveen Kumar Car Accident: ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ భారత మాజీ ప్లేయర్!

Published Date :July 5, 2023 , 2:01 pm
By Sampath Kumar
Praveen Kumar Car Accident: ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ భారత మాజీ ప్లేయర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Former India Pacer Praveen Kumar Survive Car Crash In Meerut: టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. భారీ లోడ్‌తో వస్తున్న ఓ ట్రక్కు.. మూల మలుపు వద్ద ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారు డామేజ్ అయింది. కారులో ఉన్న ప్రవీణ్ కుమార్, అతడి కొడుకుకు స్వల్ప గాయాలు కాగా.. స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. మీర‌ట్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క్రికెట్ నుంచి తప్పుకున్నాక మీరట్‌లో నివసిస్తున్న ప్ర‌వీణ్ కుమార్.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఓ రెస్టారెంట్‌ను కూడా న‌డుపుతున్నాడు. మంగళవారం రాత్రి తన మేన‌ల్లుడిని దించేందుకు కొడుకుతో పాటు వెళ్లాడు. తిరిగి వస్తుండగా మీరట్‌ సమీపంలో ఓ మూల మలుపు వద్ద ఒక భారీ ట్రక్ కారును వెనుక నుండి ఢీ కొట్టింది. కారు పెద్ద‌ది (ల్యాండ్ రోవర్ డిఫెండర్) కావ‌డంతో వారికి ఎటువంటి గాయాలు కాలేదు. స్వల్ప గాయాలు అయిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారని మీరట్ పోలీసులు తెలిపారు.

Also Read: Nabha Natesh Latest Pics: నభా నటేష్‌ అందాల విందు.. ‘ఇస్మార్ట్’ పోరి గ్లామర్‌కు కుర్రాళ్లు ఫిదా!

‘దేవుడి దయ వల్ల మేము బయటపడ్డాం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. లేదంటే ఈ ప్రమాదం చాలా దారుణంగా ఉండేది. నేను మా మేనల్లుడుని డ్రాప్ చేయడానికి వెళ్లాను. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఒక భారీ ట్రక్ నా కారును వెనుక నుండి ఢీ కొట్టింది. పెద్ద కారు కాబట్టి బతికిపోయాం. లేకపోతే గాయాలు తీవ్రంగా అయ్యి ఉండేవి. దేవునికి ధన్యవాదాలు. కేవలం బంపర్ మాత్రమే విరిగిపోయిందనుకున్నా.. కానీ కారు బాగా దెబ్బతింది’ అని ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు. గ‌త ఏడాది డిసెంబర్ 30న కీప‌ర్ రిష‌బ్ పంత్ కూడా కారు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే.

36 ఏళ్ల ప్ర‌వీణ్ కుమార్ భారత్ త‌ర‌పున 6 టెస్టులు, 68 వ‌న్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులలో 27 వికెట్లు, వన్డేలలో 77 వికెట్లు, టీ20లలో 8 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లు కలిపి 112 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టులో 2007 నుంచి 2012 వరకు కొనసాగాడు. ఆస్ట్రేలియా గడ్డపై సీబీ సిరీస్ గెలవడంతో ప్రవీణ్ కీలక పాత్ర పోషించాడు. ఓవైపు ఫామ్ కోల్పోవడం, గాయాల పాలవడం.. మరోవైపు జట్టులోకి మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి వంటి బౌలర్లు రావడంతో ప్రవీణ్ జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. 119 మ్యాచులు ఆడిన ప్రవీణ్.. 90 వికెట్లు తీశాడు.

Also Read: Nikhil Siddhartha Apologies: మాట నిలబెట్టుకోలేకపోయా.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Car accident
  • Praveen Kumar
  • Praveen Kumar Accident
  • Praveen Kumar Car Accident
  • Team India

తాజావార్తలు

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

  • Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో.. రియల్‌మీ 16 5G భారత్ లో విడుదల

  • Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..

  • LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

  • US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions