Prashanth Neel: ఉగ్రం అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ నీల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్.. ఆ తరువాత ప్రపంచాన్నే షేక్ చేసిన కెజిఎఫ్ ను తెరకెక్కించాడు. ఈ ఒక్కక్క సినిమా.. ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ ను స్టార్ గా నిలబెట్టింది. కెజిఎఫ్ రెండు భాగాలతో ఈ డైరెక్టర్.. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఈ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సలార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను పెంచేస్తుంది.
తాజాగా ప్రశాంత్ నీల్.. ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కెజిఎఫ్ లో చేసిన తప్పులే సలార్ లో చేశాను అని.. రిలీజ్ కు ముందు తన సినిమాలను చూసుకోలేదు అని.. చూసుకొని మార్పులు చేర్పులు చేసే సమయం కూడా లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు తన మూడు సినిమాలు తనకే నచ్చలేదని చెప్పి షాక్ ఇచ్చాడు. “నా మునుపటి 3 సినిమాలు విడుదలకు ముందు, నాకు అవి నచ్చలేదు.. కానీ ఈసారి నేను భయపడ్డాను, ఎందుకంటే నాకు ఈ సినిమా నచ్చింది” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.