సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సినిమాల తర్వాత ఆయనకు డిమాండ్ రెట్టింపు అయింది. ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్ 31’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
READ MORE: Ramchander Rao: రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలి..!
ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించి భారీ రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో 50 శాతం వాటా డిమాండ్ చేసినట్లు సమాచారం. సినిమా విడుదలైన తర్వాత వచ్చిన లాభాల్లో 50 శాతం ప్రశాంత్ నీల్‌కు, 25 శాతం మైత్రీ మూవీ మేకర్స్‌కు, మిగిలిన 25 శాతం ఎన్టీఆర్ ఆర్ట్స్‌కు దక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 25 June 2026న సంక్రాంతి విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.