NTV Telugu Site icon

Pranitha Subhash: ‘బాపుబొమ్మ’లా ఉండాలంటే ఇవి తినాల్సిందే..

Pranitha

Pranitha

Pranitha Subhash: పవన కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేదీ’ సినిమాతో బాపు బొమ్మగా పిలిపించుకున్న ముద్దుగుమ్మ ప్రణీత సుభాశ్. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ సరైన విజయం దక్కలేదు. దీంతో 2021 లో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగుళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో ప్రణీత తన అందానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ను బయటపెట్టింది. తాను ఇలా మెరిసిపోయేందుకు తీసుకునే ఆహారాలను చెప్పింది. ప్రధానంగా ప్రణీత తీసుకునే ఆహారంలో ముఖ్యంగా మూడింటి గురించి సూచించింది. అవి బాదం, ఆకుపచ్చని కూరగాయలు, షుగర్ గురించిన సమాచారం.

Read Also: Ram Gopal Varma: వర్మ.. నవీన్ హత్యకేసుపై ఓ సినిమా తీస్తే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం

ప్రతి రోజూ ఉదయం క్రమం తప్పకుండా తగినన్ని బాదం పప్పులను తింటానని ప్రణీత తెలిపారు. ప్రధానంగా వర్కవుట్ కు ముందు, వర్కవుట్ తర్వాత తీసుకునేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయన్నారు. బాదం గింజలను తిన్నప్పుడు రోజంతా వాటి ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని ప్రణీత చెప్పారు. ఇవి శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. చురుగ్గా ఉంటారని తెలిపారు. వీటిల్లో మంచి ప్రొటీన్ ఎక్కువ మొత్తంలో ఉండడంతో కడుపు నిండినట్టు ఉంటుందని దీంతో స్నాక్స్ జోలికి వెళ్లకుండా ఉంటామని చెప్పింది. ఆకుపచ్చని తాజా కూరగాయలకు తాను తగినంత ప్రాధాన్యం ఇస్తానని ప్రణీత తెలిపారు. ఆకుపచ్చని కూరగాయల్లో కేలరీలు తక్కువ. వీటివల్ల బరువు పెరగరు. వీటిని బాయిల్ చేసి తినొచ్చు. తాజావి తీసుకుంటే గరిష్ఠ స్థాయిలో పోషకాలు లభిస్తాయి.

Read Also: Siddharth-Aditi: ఇక్కడ పవిత్ర- నరేష్.. అక్కడ సిద్దార్థ్- అదితి.. పవిత్ర బంధమట

పంచదార వినియోగాన్ని తగ్గించడం ఎంతో మంచిది. టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు వంటి అనారోగ్యాల రిస్క్ ను చక్కెర వినియోగం పెంచుతుంది. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే, తీపి పదార్థాలు, పానీయాలను చాలా వరకు పరిమితం చేసుకోవాలి. తక్కువ చక్కెర ఉండే వాటినే ఎంపిక చేసుకోవాలి. పండ్లు, పెరుగు లేదా యుగర్ట్, కూరగాయలు తీసుకోవచ్చు. తగినంత నీరు తాగుతూ ఒంట్లో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. ఈ మూడు ప్రధానంగా పాటించినట్లైతే తనలా మెరిసిపోవడం ఖాయమని ఆమె సూచించారు.

Show comments