ప్రణీత సుభాష్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన కిల్లింగ్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మాయ చేసింది.గతంలో ఈ భామ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఆ మూవీ లో ప్రణీత సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తరువాత ప్రణిత స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన రభస చిత్రం లో నటించింది..కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. సూపర్ స్టార్ మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కూడా అంతగా మెప్పించలేదు.దీనితో ఈ భామ బాలీవుడ్ కు చేరింది. అక్కడ హంగామా 2, బుజ్ వంటి రెండు చిత్రాల్లో ప్రణీత హీరోయిన్ గా నటించింది..
బాలీవుడ్ లో కూడా ఈ భామకు అంతగా కలిసిరాలేదు.ఆమె నటించిన ఆ రెండు సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయి లో ఆడలేదు. దీంతో ఈ భామ మరలా సౌత్ కి తిరిగొచ్చింది.ప్రణీతకు 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజు తో వివాహం జరిగింది.అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. రీసెంట్ గా ప్రణిత పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. పెళ్లి అయినా కూడా ఈ భామ తన నటన కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ సినిమా లో నటిస్తుంది.. ఇటీవల మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి జంటగా ఓ చిత్రానికి కూడా సైన్ చేసింది..రీసెంట్ గా సైమా ప్రెస్ మీట్ కి హాజరైన ప్రణీత సుభాష్ అక్కడ స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.. బ్లాక్ కలర్ డిజైనర్ వేర్ ధరించి ఈ అమ్మడు తన థైస్ హైలెట్ అయ్యేలా బోల్డ్ ఫోజుల్లో మతి పోగొట్టింది.ఈ ఈవెంట్లో ప్రణీత సుభాష్ హాట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది