Shabbir Ali : కామారెడ్డి జిల్లాలోని మల్టీస్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన ప్రాణహిత-చేవెళ్ల పునరుజ్జీవన దిశగా సాగుతుంది. కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అనంతరం మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి ప్రజల జీవనాధారం ఈ ప్రాజెక్టు అని పేర్కొన్న ఆయన, ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో రూ.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్షలో కూడా ప్రాజెక్టు పురోగతిపై చర్చించామని తెలిపారు.
కొండం చెరువు వద్ద ప్రాణహిత ప్రాజెక్టు ప్రాథమికంగా 0.80 టీఎంసీలకు డిజైన్ చేయబడిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దీనిని 3.5 టీఎంసీలకు పెంచారని షబ్బీర్ అలీ వివరించారు. ఇది వల్ల 9 గ్రామాలు , తండాలు ముంపుకు గురవుతాయని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన సమీక్షలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం అభ్యంతరాలు తెలిపారని వెల్లడించిన షబ్బీర్ అలీ, త్వరలో పాత డిజైన్ ప్రకారమే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో మళ్లీ ఆంథోనీ అల్బనీస్‌దే విజయం.!
ప్రాజెక్టు పురోగతిలో భాగంగా ప్రభుత్వంస్థాయిలో భూసేకరణకు రూ. 23.15 కోట్ల నిధులు విడుదల చేయబడ్డాయని షబ్బీర్ అలీ తెలిపారు. దీంట్లో భాగంగా మొదటి విడతగా 316 ఎకరాల భూసేకరణను చేపట్టనున్నట్లు, మొత్తం 619 మంది రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభం అయిందని పేర్కొన్నారు. తిమ్మక్‌పల్లి వద్ద 1.4 టీఎంసీల పనులు వారం రోజుల్లో ప్రారంభిస్తామని, వెంటనే రెండో విడత భూసేకరణ ప్రారంభమవుతుందన్నారు. మొత్తం ప్రణాళిక ప్రకారం కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.
Sai Sudharsan: సచిన్ రికార్డు బద్దలు.. ఒక్క డకౌట్ లేకుండా 2000 పరుగులు!