జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వేడుక మందిరంలో లోక్ సభ ప్రవాస యోజన నూతన ఓటర్లతో సమావేశం నిర్వహించారు కేంద్ర కోల్,మైనింగ్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. భారత దేశం 11 ఆర్థిక స్థాయి నుంచి ఐదవ స్థాయికి ఎదుగుతుందన్నారు. అంతేకాకుండా.. ’75వ స్వతంత్ర దినోత్సవాలలో ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చింది, బ్రిటిష్ వారిని వెనుకకు నెట్టి భారత్ 05 వ స్థానానికి రావడం సంతోషం. మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, నరేంద్ర మోడీ గ ఆద్వర్యంలో దేశం ముందుకు వెళ్తుంది. ప్రపంచంలో ఉక్రెయిన్ యుద్ధం జరిగిన సమయంలో 21 వేల మంది విద్యార్థులను మన దేశానికి తీసుకుని వచ్చిన ఘనత నరేంద్ర మోడీ ది.. తీరంగా జెండా పట్టుకొంటే చాలు మన దేశానికి తీసుకుని వచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ దే.
Also Read : Rahul Ganghi : బ్రిటీషర్లకు సావర్కర్ సాయం చేశాడు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో 2G స్పెక్ట్రమ్ తీసుకుని వచ్చిన సమయంలో అనేక కుంభకోణం జరిగింది, కానీ నరేంద్ర మోడీ నాయకత్వం లో 5G స్పెక్ట్రమ్ తీసుకుని వచ్చిన ఎలాంటి అవినీతి లేకుండా చేసిన ఘనత నరేంద్ర మోడీ దే.. దేశంలో అన్ని 2G,3G,4G చూసాము, కానీ 5G తీసుకుని రావడంలో,ఎలాంటి అవినీతి లేకుండా తీసుకుని వచ్చిన ఘనత నరేంద్ర మోడీ ది. ఈ రోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశం, దేశంలో 7 జీడీపీ అభివృద్ధి చెందుతుంది.దానికి కారణం అవినీతి లేని నరేంద్ర మోడీ పాలన.. ఏలాంటి అవినీతి లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా ప్రజల అకౌట్లలో డబ్భులు వేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రపంచంలో భారత దేశం మొదటి స్తానం రావడానికి మనం కృషి చేయాలి. మీరు అందరూ ఓటు హక్కును నమోదు చేసుకొని, ఓటు హక్కును దేశంలో, రాష్ట్రంలో బీజేపీ కి వేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.