Rahul Ganghi : బ్రిటీషర్లకు సావర్కర్ సాయం చేశాడు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Ganghi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హిందుత్వ వాది వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటీషర్లకు సాయం చేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభిమాన నేత వీర్ సావర్కర్ భారత్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటీషర్లతో ఎలా వ్యవహరించాడన్న దాన్ని బయటపెట్టేలా ఉన్న ఓ లేఖను రాహుల్ గాంధీ ఇవాళ బయటపెట్టారు. భారత జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పట్లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీ, నెహ్రూ, పటేల్ లను మోసం చేసేలా సావర్కర్ లేఖలు ఉన్నట్లు రాహుల్ తెలిపారు.
Read Also: Angry Elephant: ఏనుగుకు ఎదురెళ్లారు.. ఊరుకుంటుందా 8కి.మీ పరిగెత్తించి మరీ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కొన్ని రోజుల క్రితం సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ కూడా ఆ వ్యాఖ్యలను బలపరుస్తూ లేఖను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనేది లేదని కావాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం కావాలంటే తనను అరెస్టు చేసుకోవచ్చు అని కూడా రాహుల్ సవాల్ చేశారు.
Read Also: Mobile Phones Ban: అక్కడ మొబైల్ ఫోన్స్ వాడడంపై నిషేధం.. ఏకగ్రీవ తీర్మానం
రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో .. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. వీడీ సావర్కర్ పట్ల తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మరో వైపు స్వాతంత్య్ర సమరయోధుడిపై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది.
सावरकर जी ने अंग्रेजों की मदद की। उन्होंने अंग्रेजों को चिट्ठी लिखकर कहा – सर, मैं आपका नौकर रहना चाहता हूं।
– श्री @rahulgandhi pic.twitter.com/1sKszyDXR0
— Congress (@INCIndia) November 17, 2022
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..