Imanvi : ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్మోగిపోతున్న పేరు ఇమాన్వి. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయని ఈ బ్యూటీ.. ఓ స్పెషల్ మూవీలో ఛాన్స్ కొట్టేసి దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సోషల్ మీడియా ఫేమ్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా ఎంపికైంది. మొదట్లో ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వి ఎంపికను చూసి చాలా మంది షాక్ అయ్యారు. కానీ మెల్లమెల్లగా ఇమాన్వీకి వస్తున్న పాపులారిటీ చూస్తే కంగుతినాల్సిందే. ప్రభాస్ వంటి పాన్ వరల్డ్ హీరోకి జోడీగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ని తీసుకోవడం ఏంటని పెదవి విరిచిన వారే ఇప్పుడు ఆమెతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Read Also:Biggest Stampedes: దేశంలో జరిగిన అతి పెద్ద తొక్కిసలాట ఘటనలు ఇవే.. వందలాది మరణాలు!
ప్రభాస్ సినిమా పూర్తయి విడుదల అయ్యే వరకు మరే సినిమాకు కమిట్ కావొద్దని ఇమాన్వితో అగ్రిమెంట్ ఉంది. లేదంటే ఇప్పటి వరకు ఆమె చేతిలో డజన్ కు పైగా సినిమాలు ఉండేవి. ఫౌజీ సినిమా నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ తన హిందీ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్‌ను సెలక్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందబోతున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా ఇమాన్వి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సెలక్ట్ చేశారని తెలుస్తోంది. ఫౌజీ సినిమా వచ్చిన కొన్ని నెలల తర్వాత కార్తీక్ ఆర్యన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ సినిమా పూర్తి చేసిన తర్వాతే కార్తీక్ ఆర్యన్ సినిమా షూటింగ్‌లో ఇమాన్వి జాయిన్ కానుందట.
Read Also:Pragya Jaiswal : ‘డాకు మహారాజ్’ అద్భుతంగా ఉంటుంది : ప్రగ్యా జైస్వాల్
ప్రభాస్ ఫౌజీ సినిమాకు చాలా తక్కువ పారితోషకం అందుకుంటున్న ఇమాన్వి తదుపరి సినిమాకు కోటికి తక్కువ కాకుండా రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇటీవల కాలంలో హీరోయిన్స్ రెమ్యునరేషన్ రూ. కోటి అంటే మామూలు విషయం కాదు. కానీ ఇమాన్వి నటించిన ఒక్క సినిమా పూర్తి కానేలేదు. ఒకే సినిమాలో చేస్తున్నా రెండో సినిమాకే కోటికి మించి పారితోషికం తీసుకోవడం అంటే చాలా అరుదైన విషయం. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో సినిమా చేయడం వల్లే తన ఇమేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఫౌజీ కాకుండా మరే సినిమాకు ఆమె కమిట్ కాలేదు. కానీ అనధికారికంగా బాలీవుడ్‌లో రెండు సినిమాలు, టాలీవుడ్‌లో మూడు సినిమాలు, కోలీవుడ్‌లో రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అందులో కొన్ని దాదాపుగా ఫైనల్ అయ్యాయి. ఫౌజీ తర్వాతే అధికారికంగా ఒప్పందం చేసుకుందామని ఆమెకు లక్షల్లో అడ్వాన్సులు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది.