Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఒక్క పేరే వినిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భూషణ్ కుమార్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఏ ముహూర్తాన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి వివాదాలు మొదలయ్యాయి. విఎఫ్ ఎక్స్ బాలేదని, హనుమంతుడి పోస్టర్ బాలేదని, రాముడు ఇలా ఉండకూడదని, సీత అలా ఉందని.. ఒకటి కాదు రెండు కాదు.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ వెనుక ఒక వివాదం ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక మేకర్స్ సైతం ప్రీ పబ్లిసిటీ వస్తుందని సైలెంట్ గా ఉండిపోయారు తప్ప.. వివాదాలపై క్లారిటీ ఇచ్చినవారు లేరు. ఇవన్నీగతం .. ఇక ప్రస్తుతం ఆదిపురుష్ ట్రైలర్ పైనే అందరి చూపు ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను 3డీ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. 50 దేశాల్లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
Kalavedika: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పలువురికి పురస్కారాలు!
ఇక నేడు.. ఏఎంబీ సినిమాస్ లో ఆదిపురుష్ ట్రైలర్ ప్రైవేట్ స్క్రీనింగ్ చేయనున్నారు. దీనికోసం చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ కు వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ప్రభాస్ ఏఎంబీ లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ అందరిని ఆకట్టుకొంటుంది. అంతకు ముందులా బ్లాక్ టీ షర్ట్, తలకు క్యాప్ పెట్టుకోకుండా.. ఈసారి ప్రభాస్ లుక్ మార్చాడు. బ్లాక్ షర్ట్, స్టైలిష్ గ్లాసెస్ తో అటెండ్ అయ్యాడు. ఈ ఫోటోతో పాటు ప్రభాస్ ఇంకో ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ లో ప్రభాస్.. అదిరిపోయాడు. దీంతో అభిమానులు ప్రభాస్ కొత్త లుక్ కు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. కింగ్.. కింగ్ వచ్చాడు, మా డార్లింగ్ లుక్ మారింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.