Site icon NTV Telugu

Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో ఊహించని లుకా.. సందీప్ వంగ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Spirit

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందనే దీనిపై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే రీసెంట్‌గా ప్రభాస్ కాస్త సన్నబడి, మీసకట్టుతో కనిపించిన లుక్ చూసి అభిమానులు ఇదే ఫైనల్ అంటున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలైన షాక్ ఇంకా ముందే ఉందట.

Also Read : Nidhhi Agerwal : పవన్–ప్రభాస్ మల్టీస్టారర్‌పై కన్నేసిన నిధి అగర్వాల్..

ఈ సినిమాలో ప్రభాస్ కేవలం ఒకే రకమైన మేకోవర్‌తో కాకుండా, మరో క్రేజీ వేరియేషన్‌లో కూడా కనిపిస్తారని తెలుస్తోంది. అదేలా ? అంటే సందీప్ రెడ్డి వంగకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది.. సినిమా తీస్తున్నప్పుడు తన హీరో లుక్ ఎలా ఉంటుందో, తను కూడా దాదాపు అదే స్టైల్‌ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. గతంలో ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల టైంలో ఇది ప్రూవ్ అయ్యింది. ఇటీవల సందీప్ క్లీన్ షేవ్ చేసి కేవలం మీసాలతో కనిపించడంతో, ప్రభాస్ ‘స్పిరిట్’ లో సరికొత్త పోలీస్ ఆఫీసర్ లుక్‌లో కనిపించడం ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వంటి కీలక నటులతో షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే ప్రభాస్ మరో మేకోవర్‌లోకి మారనున్నారట. ఈ మ్యాడ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

Exit mobile version