రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహకే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊహను నిజం చేస్తూ ‘స్పిరిట్’ మూవీ సెట్స్ నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను నిర్మిస్తోందట. కాగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోల ఎంట్రీ ఎంత వైల్డ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ‘స్పిరిట్’ కోసం ప్రభాస్‌పై ఒక అదిరిపోయే ఎంట్రీ సాంగ్‌ను ఈ పోలీస్ స్టేషన్ సెట్‌లోనే షూట్ చేయబోతున్నారని సమాచారం. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా, ఈ పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట.
Also Read : Rashmika : నేషనల్ క్రష్ కోసం.. జాతిరత్నాలు డైరెక్టర్ మాస్టర్ ప్లాన్?
కాగా ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని రీతిలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా విజన్ ప్రకారం, ఈ పోలీస్ స్టేషన్ సెట్ విజువల్స్ చాలా రియలిస్టిక్‌గా మరియు ఇంటెన్స్‌గా ఉండబోతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్, ప్రభాస్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ రేంజ్ మరియు సందీప్ మేకింగ్ తోడైతే, ఈ పోలీస్ స్టేషన్ సెట్‌లో జరిగే అల్లకల్లోలం థియేటర్లలో రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.