Prabhas says I will do film with Ram Charan: ఆదిపురుష్ సినిమా అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్) కూడా ఒకటి. ‘మహానటి’ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కేలో దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రాజెక్ట్ కే టైటిల్, గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో చిత్ర యూనిట్ సినిమా టైటిల్, గ్లింప్స్‌ను ( Kalki 2898 AD Glimpse) విడుదల చేసింది. సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ అని పేరు పెట్టారు. టైటిల్, గ్లింప్స్ సందర్భంగా చిత్ర యూనిట్ యూస్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేస్తారా? అన్న ప్రశ్నకు.. ‘నాకు రామ్ చరణ్ మంచి స్నేహితుడు. ఏదో ఒక రోజు మును కలిసి సినిమా చేస్తాం. కచ్చితంగా చేస్తాం’ అని ప్రభాస్ తెలిపాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Rohit Sharma: ఎంఎస్ ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ!
ప్రభాస్ మాట్లాడుతూ… ‘భారత్‌లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఆర్‌ఆర్‌ఆర్ చాలా గొప్ప సినిమా. ఆ సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశ ప్రజలందరికీ దక్కిన గొప్ప గౌరవంగా భావించాం. రాజమౌళి గారు ఇలాంటి వాటికి అర్హుడు. ఇంకా మంచి సినిమాలు చేస్తాడని నేను నమ్ముతున్నా’ అని అన్నాడు.
‘బాహుబలి, ఆదిపురుష్, సాహో, సలార్, కల్కి 2898 ఏడీ.. ఇలా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. కల్కి 2898 ఏడీలో బ్లూ స్క్రీన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని చూసి బోర్ కొట్టడంలేదా?’ అని అడగ్గా.. ‘ఆరంభంలో నాకు చాలా బోర్ కొట్టింది. పెద్ద బ్లూ స్క్రీన్ ముందు.. నేను చాలా చిన్నగా కనిపించేవాడిని. ఇప్పుడు గ్లింప్స్ చూశాక చాలా ఆనందం వేసింది. ఏంటో బాగుంది అనిపించింది’ ప్రభాస్ సమాధానం ఇచ్చారు.
Also Read: Sweet Corn Health Benefits: స్వీట్‌కార్న్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వయసుని కూడా తగ్గిచేస్తుంది!
Yeah,We Might Sometime Ram Charan Is My Friend They Are My Friends ❤️
So, We Are Going To Work One Day For Sure – My Darling #Prabhas Anna❤️🔥#Prabhas & #RamCharan Bond ❤️🙏🏻#ProjectKGlimpse #ProjectK #ProjectKatComicCon #GameChanger pic.twitter.com/QWT8vjV49M
— 𝗖𝗵𝗶𝗿𝗮𝗻𝗷𝗲𝗲𝘃𝗶 Prabhas (@WeLoveMegastar) July 21, 2023