Site icon NTV Telugu

Prabhas : పీపుల్ మీడియాని ఆదుకునేందుకు రెబల్ స్టార్ రెడీ

Prabhas

Prabhas

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాలు చూసింది.  ‘ది రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, నిర్మాతలకు అండగా నిలవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు.

Also Read : AA 22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఫస్ట్ లుక్ & గ్లిమ్స్ రిలీజ్ డేట్ లాక్

ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను కలిసిన ప్రభాస్ పీపుల్ మీడియ బ్యానర్‌లో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారట. సాధారణంగా ఒక సినిమా ఫలితం తేడా కొడితే హీరోలు తర్వాతి ప్రాజెక్టుల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ తెలుగు హక్కులను కొనుగోలు చేసి భారీగా నష్టపోయింది. ఆ సమయంలోనే వారిని ఆదుకుంటానని ప్రభాస్ మాట ఇచ్చారు. దాని ఫలితంగానే ‘ది రాజా సాబ్’ పట్టాలెక్కింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకోవడంతో, మరోసారి ఆ బ్యానర్‌కు లాభాలు తెచ్చిపెట్టేలా ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన అభిమానులు “మా హీరో బంగారం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, స్పిరిట్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక పీపుల్ మీడియాలో సినిమా చేసే అవకాశం ఉంది.

Exit mobile version