పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజసాబ్ షూటింగ్ ను ఫినిష్ చేసి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసేలా ప్రభాస్ వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్ (Spirit)’ పై కూడా ఫోకస్ చేశాడు డార్లింగ్.
Also Read : Power Star : ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో ‘OG పార్ట్ 2’
‘ఫౌజీ సినిమా రిమైనింగ్ షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసి స్పిరిట్ లో ఫినిష్ చేసేలా తదుపరి టార్గెట్‌గా పెట్టుకున్నాడట. ఈ రెండు సినిమాల పనులు దాదాపు బ్యాక్ టు బ్యాక్‌గా సాగనున్నాయి. ఇదిలా ఉండగాప్రభాస్ నటించాల్సిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD: పార్ట్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని సమాచారం. ప్రభాస్ షూటింగ్‌లో జాయిన్ అయ్యేలోపు, ఇతర నటులతో సంబంధించిన కీలక సన్నివేశాలను ముందుగానే చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ‘ఫౌజీ’ మరియు ‘స్పిరిట్’ షూటింగ్‌లు ఫినిష్ చేసేందుకు వచ్చే ఏడాది వరకు అవుతుంది. ఆ తర్వాత ‘కల్కి 2898 AD పార్ట్ 2’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఆ సినిమాతో పాటు సలార్ 2 కూడా స్టార్ట్ చేయబోతున్నాడు ప్రభాస్. ఈ లెక్కన వచ్చే రెండేళ్ల పాటు ప్రభాస్ పూర్తిగా సినిమాలకే అంకితమవ్వబోతున్నాడన్నమాట.మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ట్రీట్ లాంటిదే. వరుసగా భారీ సినిమాలు, భారీ అంచనాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో మరోసారి తన స్టామినాను చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
