పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.. తాజాగా డార్లింగ్ స్మార్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అయితే ప్రభాస్ రేంజ్, రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడు కానీ ఫిట్నెస్ విషయంలో పెద్దగా శ్రద్ద చూపించలేదు.. ఇటీవల చికిత్స చేయించుకొని ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ ఒక్కప్పటి లుక్స్ లోకి వచ్చేశాడు. యంగ్ అండ్ స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు.. తాజాగా ప్రభాస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆ వీడియోలో ప్రభాస్ బాగా బరువు తగ్గి మిర్చి సినిమా లుక్ లో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు.. ఈ వీడియో చూసిన అభిమానులు వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ వీడియోని షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.. సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ కల్కి సినిమా విడుదల కాబోతుంది. అలాగే మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.. ఆ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి..