పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన ”సలార్”మూవీతో ప్రభాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఈ సినిమాలో కమల్ హాసన్ ,అమితాబ్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు .అలాగే ప్రభాస్ మరోవైపు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నారు.ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
అలాగే ప్రభాస్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ”స్పిరిట్” అనే మూవీ చేస్తున్నాడు .ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు .త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ..ఇప్పటికే కల్కి ,రాజా సాబ్ సినిమాల నుంచి విడుదల అయిన ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసాయి.. తాజాగా ప్రభాస్ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా సరికొత్త అవతార్‌లో కనిపిస్తూ వావ్ అనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్‌తో ఉన్న ప్రభాస్ లుక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ లుక్ ఏ సినిమా కోసం అనేది అయితే క్లారిటీ లేదు .