Site icon NTV Telugu

Anil Ravipudi-Prabhas : ప్రభాస్ పై అనిల్ రావిపూడి ప్రశంసలు.. సీనియర్ల పట్ల రెబల్ స్టార్ గౌరవానికి ఫిదా!

Prabas, Anil Ravipudi

Prabas, Anil Ravipudi

ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ సీనియర్ హీరోల గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సీనియర్ హీరోలు ఇండస్ట్రీకి పిల్లర్ల లాంటివని, వారు ఎప్పుడూ ముందు స్థానంలో ఉండాలని ప్రభాస్ తన మనసులోని మాటను పంచుకున్నారు. దీనిపై ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఎమోషనల్‌గా స్పందించారు.

Also Read : Pooja-Sreeleela: కోలీవుడ్‌లో పూజా–శ్రీలీల కెరీర్‌కు గట్టి పరీక్ష..

ప్రభాస్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అనిల్ రావిపూడి స్పందిస్తూ.. “ప్రభాస్ అన్న చేసిన ఈ కామెంట్స్ నిజంగా ఒక గ్రేట్ గెశ్చర్. ఇండస్ట్రీ లో ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన గౌరవాన్ని ఆయన చాటి చెప్పారు” అంటూ కొనియాడారు. తోటి హీరోలు, అందులోనూ తనకంటే సీనియర్ల పట్ల ప్రభాస్ చూపించే ఈ వినయం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఎత్తులో నిలబెట్టిందని అనిల్ అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాల మధ్య పోటీ సహజమే అయినా, హీరోల మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం మరియు ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండటం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ప్లస్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ వ్యాఖ్యలను ప్రశంసించడంతో, మెగాస్టార్ మరియు ప్రభాస్ అభిమానుల మధ్య ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

 

Exit mobile version