Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
- అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
- పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం
- విగ్రహాన్ని 'స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్'గా నామకరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’గా నామకరణం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ప్రశంసించారు. బీజేపీ నాయకుడు మాధవ్ రాష్ట్రం మొత్తం తిరుగుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో సహకారం అందిస్తున్నారని సీఎం చెప్పారు.
పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా ఈ 58 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘కేవలం 58 రోజుల్లోనే ఈ విగ్రహ నిర్మాణం పూర్తయింది. విగ్రహం పైభాగానికి ఎక్కి చూస్తే అమరావతి రాజధాని మొత్తం కనిపిస్తుంది. అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. కొందరు అమరావతి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. ఈ రాజధానిని స్మశానం, ఎడారి అంటూ విమర్శలు చేశారు. కానీ రైతులు తమ భూములను ఇచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి నిర్మాణానికి భాగస్వాములు అయ్యారు’ అని గుర్తు చేశారు.
Also Read
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
Also Read: Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్
‘పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన త్యాగం మొత్తం తెలుగు ప్రజలకే ప్రేరణగా నిలిచింది. ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఈ విగ్రహ నిర్మాణంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పడిన కూటమి ప్రజలకు మంచి ఫలితాలు అందిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం అవసరం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందం, ఆరోగ్యం, ఆదాయం కలిగి ఉండేలా పని చేయడమే నిజమైన నివాళి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!