విశాఖ బీచ్‌లో శ్వేత అనే మహిళ మృతదేహం కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. విశాఖ బీచ్‌లో యువతి మృతదేహం కేసులో పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది ఆసక్తిగా మారింది. ఆర్కే బీచ్‌లో శ్వేత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. విశాఖ మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్వేత మృతదేహానికి శవ పంచానామా నిర్వహించారు.