NTV Telugu Site icon

Posani Krishna Murali: కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలి?

Posani Krishnamurali

Posani Krishnamurali

Posani Krishna Murali: డిక్లరేషన్ వివాదంపై పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అంటున్నారని.. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం ఏ అఫిడవిట్ లేకుండా క్రిస్టియన్, ముస్లింల ఇంటికి వెళ్తారు.. అప్పుడు ఎవరికైనా అఫిడవిట్ ఇచ్చారా చంద్రబాబు అంటూ ప్రశ్నలు గుప్పించారు. తాను హిందువునని.. తాను తన భార్యతో కలిసి మసీద్, చర్చి అన్నింటికి వెళ్లామని.. మాకు ఎక్కడా అఫిడవిట్ అడగలేదని పోసాని పేర్కొన్నారు. చంద్రబాబు లాగా ఏ ఒక్కరికి హీన మనస్తత్వం లేదన్నారు.

Read Also: Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా.. ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశానని చంద్రబాబు చెప్తున్నారని పోసాని పేర్కొన్నారు. ..ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను చూశామన్నారు. “చంద్రబాబు హిందూ ధర్మ పరిరక్షకుడు అంట.!.. అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మందు అమ్మకాలు జరగడంలేదన్న వ్యక్తి.. ధర్మ పరిరక్షకుడా.! మత్తతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్న అని గతంలో మసీద్‌ లనే చెప్పాడు.. మాట తప్పాడు.. మోడీ అంటే కేడీ.. కేడీ అంటే మోడీ అని ఎంత ఘోరంగా బాబు తిట్టాడు..బాబు లాంటి వ్యక్తి వస్తాడనే అంబేడ్కర్ చాలా బలమైన రాజ్యాంగాన్ని రాశాడు.. ఇట్లాంటి వాళ్ల నుంచి కాస్త స్వేచ్ఛగా బతుకుతున్నాం..” అని పోసాని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Read Also: Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్

జగన్ ఏ పాపం చేసాడని.. ఆయనను ఎందుకింత హింసిస్తున్నారని ప్రశ్నించారు. కొడుకు భవిష్యత్తు కోసం జగన్‌ను నాశనం చేయాలని చూస్తున్నారా.. చంపాలనుకుంటున్నారా అని ఆయన అన్నారు. దేశంలోని పార్టీలను అడుగుతున్నా.. చంద్రబాబు అనేక పార్టీలతో పొత్తుపెట్టుకున్నాడన్నారు. పార్టీలతో పొత్తు పెట్టుకునేటప్పుడు చంద్రబాబు దగ్గర అఫిడవిట్ ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. తిరుమలను నాశనం చేయడానికి చూస్తున్నారని.. భక్తులు తెలుసుకోవాలన్నారు. దేవుడ్ని నమ్మండి.. మోసపూరిత కుట్రలను కాదని పోసాని సూచించారు. చంద్రబాబు దేవుడి కంటే అతీతుడా.. తిరుమలకు రావొద్దు అనడానికి చంద్రబాబు ఎవరు అని పోసాని ప్రశ్నించారు. జగన్‌ది గ్రేట్‌ పాలిటిక్స్‌.. చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్‌ అంటూ పోసాని కృష్ణమురళి విమర్శించారు.

 

Show comments