ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది పూజాహెగ్డే. అయితే ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే పూజా అందానికి మాత్రం కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ తన అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది.
మ్రోడన్ డ్రస్సుల్లో అయినా ట్రెడిషనల్ లుక్ లో అయినా పూజ కెవ్వు కేక అన్నట్లు ఉంటుంది.ఇక తాజాగా పూజా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో పూజ చీరలో, గాగ్రాలో కనిపించింది. చీర కట్టులో కవ్వించే కళ్లతో పూజా ఆకట్టుకుంటుంది.
ఇక అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన పింక్ కలర్ చీరలో పూజా మంచి ఆటిట్యూడ్ ఫోజ్ లో కనిపించడం బాగుంది. ఎల్లో కలర్ శారీలో సెక్సీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పర్పుల్ కలర్ గాగ్రాలో ఇరగదీసేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే పూజకు ఈ మధ్య టైం అసలు కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి.
ఈ అమ్మడు చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతుంటే మరికొన్ని సినిమాల నుంచి ఈ అమ్మడే తప్పుకుంటుంది. తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోగా హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైన సంగతి తెలిసిందే.