రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.హిందు సంస్కారం తెలియని వ్యక్తి కిషన్ రెడ్డి అన్నారు. ఇక్కడి వాళ్ళను చేసుకున్నాక.. సోనియాగాంధీ ఇక్కడి మనిషి అయ్యిందన్నారు. దేశ సంస్కారం తెలియని వ్యక్తి కేంద్ర మంత్రి అవ్వడం అవమనకరమని దుయ్యబట్టారు. మొదటి దశ ఎన్నికల తర్వాత ప్రధాని హోదాలో ఉన్న ఆయన గౌరవం లేకుండా మట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు గుడిలో ఉండే దేవుణ్ణి రోడ్డు మీదకు తెచ్చారన్నారు. కిషన్ రెడ్డిని హనుమాన్ చాలీసా చూడకుండా చదవమని చెప్పారు. పదేళ్లు పని చేయించుకుని సిరిసిల్ల చేనేతలకు డబ్బులు ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల పాపంతోనే చేనేతలు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు ఇచ్చామని తెలిపారు. పాత బకాయిలు మేము ఇస్తున్నాం.. పైగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు.
READ MORE: Nambur Shankar Rao: వైసీపీ గెలుస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది..
నేతన్నల పట్ల తమకు సానుభూతి ఉందని పేర్కొన్నారు. ధైర్యం ఇవ్వాల్సింది పోయి.. బీఆర్ఎస్ నేతన్నలను ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తుందని విమర్శించారు. హాస్టల్ పిల్లలకు అవసరం అయ్యే అన్ని వస్త్రాలు తామే కొంటామని.. విద్యార్థులు అధైర్య పడొద్దని స్పష్టం చేశారు. వస్త్ర రంగంపై జీఎస్టీ (gst) వేసింది బీజేపీ కాదా.? బండి సంజయ్ సమదానం చెప్పాలి.. అని ప్రశ్నించారు. చేనేతలకు కేంద్రం ఏం చేసేందో చెప్పాలన్నారు. సిరిసిల్లలో సమస్యలకు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీజేపీ కారణమా..? నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన మేమా..? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కాబోయే మాజీ మంత్రి అని విమర్శించారు.