కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశాడంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, కమ్యూనిస్టుల కలియిక అపవిత్రమైనదంటూ మండిపడ్డారు. మునుగోడు ఎన్నికలో కేసీఆర్ డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా… బీజేపీ పార్టీని చూసి కేసిఆర్ భయపడుతున్నాడని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అన్ని స్కాంలు చేశారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీలు స్వతంత్ర దర్యాప్తు సంస్థలు.. వాటిపై కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ పొంగిలేటి మండిపడ్డారు.
Also Read : CM KCR : తెలంగాణ సర్కార్ తీపికబురు.. మరోసారి కంటి వెలుగు కార్యక్రమం
రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం వర్ధిల్లుతోందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ , కుటుంబ పార్టీలు విషం కక్కుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. జీ20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అన్ని దేశాలు కొనియాడాయని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారతదేశ గౌరవ ప్రతిష్టను ప్రపంచ దేశాలకి తెలిసేలా చేశారని ఆయన అన్నారు. మోడీ భారత్‌ను ప్రపంచ దేశాల్లో ముందు వరుసలో నిలబెట్టారని ఆయన అన్నారు.
Also Read : Balakrishna: స్నేహమేరా జీవితం అంటున్న బాలకృష్ణ!